‘ఇందులో కొత్తేముంది’.. పాక్ వైఖరిపై గవాస్కర్ సెటైర్లు..

Sunil Gavaskar
X

ఐసిసి టి-20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మరింత ప్రత్యేకం కానుంది. అయితే భారత్‌తో తాము మ్యాచ్ ఆడమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రగల్భాలు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ వైఖరిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు. మ్యాచ్ సమయానికి పాక్ తన నిర్ణయాన్ని మార్పుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు.

పాక్ క్రికెటర్లు గతంలో తమ రిటైర్మెంట్‌ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నట్లే.. పాక్ కూడా ఈ విషయంలో యూటర్న్ తీసుకోవచ్చని గవాస్కర్ పేర్కొన్నారు. ‘‘ఇందులో కొత్తేముంది? పాకిస్థాన్ క్రికెటర్లు ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. నాలుగు రోజుల తర్వాత మా అభిమానులు మమ్మల్ని ఇంకా ఆడమన్నారని చెప్పి.. వారు తమ రిటైర్మెంట్లను వెనక్కి తీసుకుంటారు. ఇలాంటిదే మరోసారి జరుగుతుంది. 15వ తేదీ కంటే ముందే ఇది జరగ వచ్చు’’ అని గవాస్కర్ అన్నారు. ఇక మెగా టోర్నీలో పాకిస్థాన్.. భారత్‌తో మ్యాచ్‌ను బహిస్కరిస్తే.. ఐసిసి నుంచి తీవ్రమైన చర్యలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘భారత్‌తో మ్యాచ్ నుంచి పాక్ వైదొలగడానికి సరైన కారణాలు, ఆధారాలు చూపకపోతే.. ఐసిసి నుంచి చర్యలకు లోనుకావాల్సి వస్తుంది’’ అని గవాస్కర్ తెలిపారు.

Tags

Next Story