షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. శుక్రవారం షూటింగ్ విభాగంలో భారత్‌కు పసిడి పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో భారత్‌కు చెందిన కమల్‌జీత్, సురుచి సింగ్ జోడీ స్వర్ణం దక్కించుకుంది. క్వాలిఫయింగ్ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కమల్‌జీత్, సురుచి సింగ్ ఫైనల్లోనూ సత్తా చాటింది. అత్యంత నిలకడైన ఆటతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి వరకు ఏకాగ్రతతో ఆడిన కమల్‌జీత్, సురుచి జోడీ 484.6 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. దక్షిణ కొరియా జంటకు రజతం, ఇరాన్‌కు చెందిన జోడీకి కాంస్య పతకం లభించింది.
రైఫిల్ టీమ్ విభాగంలో రజతం
పురుషుల 50 మీటర్ల రైఫిల్ టీమ్ విభాగంలో భారత్‌కు రజతం లభించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంశ్ పాటిల్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత బృందం తృటిలో స్వర్ణం గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. అద్భుత ఆటతో అలరించిన భారత టీమ్ 1762 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. చైనా టీమ్ 1766 పాయింట్లతో తొలి స్తానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది.
స్కాష్, టిటిలలో పతకాలు ఖాయం
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. స్కాష్‌లో భారత్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన జోష్న చిన్నప్ప, సింథిల్ కుమార్ జోడీ విజయం సాధించింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన డేవిడ్, జమైకా జంటతో జరిగిన పోరులో జోష్న జంట 113, 115తో జయకేతనం ఎగుర వేసింది. సెమీస్‌కు చేరడంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. ఇక టిటి మిక్స్‌డ్ ఈవెంట్‌లో కూడా భారత జంట సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసుకుంది. మనుష్ షా, దియా చితాలే జోడీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో ఈ జోడీ హాంకాంగ్ జంటను ఓడించింది. సెమీస్‌కు చేరడంతో కాంస్యం ఖరారైంది.
-
Home
-
Menu
