ఎసిబి వలలో సర్వేయర్, అసిస్టెంట్

ఎసిబి వలలో సర్వేయర్, అసిస్టెంట్
X

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్నబోనాలలో ప్రవీణ్ అనే రైతుకు చెందిన 3 ఎకరాల భూమిని సర్వే చేసేందుకు సర్వేయర్ వేణుగోపాల్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. అందులో రూ.10 వేలు ముందుగా స్వీకరించి సోమవారం భూమి సర్వే చేశాడు. మంగళవారం సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రూ.20 వేలు ఇవ్వడానికి మనసొప్పని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ సారధ్యంలో సిరిసిల్లలో కాపుకాసి, బాధితుడి నుండి సర్వేయర్ వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి బుధవారం ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. కాగా, మంగళవారం ఎసిబికి చిక్కిన సర్వేయర్ వేణుగోపాల్‌పై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

Tags

Next Story