గడ్డ పోతారం చైర్మన్‌గా సుష్మ.. జిన్నారం చైర్మన్‌గా జనార్దన్.. గుమ్మడిదల చైర్మన్‌గా పాపని

BRS
X

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గుమ్మడిదల చైర్మన్‌గా పాపని కుమార్ గౌడ్, వైస్ చైర్మన్‌గా చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. జిన్నారం చైర్మన్‌గా జనార్దన్, వైస్ చైర్మన్‌గా ప్రతాప్ రెడ్డి, గడ్డ పోతారం చైర్మన్‌గా గద్దె సుష్మ, వైస్ చైర్మన్‌గా మహేందర్ గౌడ్ పేర్లను ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు బిఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. అధిష్టానం ఆదేశానుసారం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

Next Story