కానిస్టేబుల్ గర్భవతి.. తలపై డంబెల్‌తో మోది హత్య

కానిస్టేబుల్ గర్భవతి..  తలపై డంబెల్‌తో మోది హత్య
X

ఢిల్లీ: నాలుగు నెలల గర్భంతో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను భర్త డంబెల్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంకూర్ అనే వ్యక్తి రక్షణ శాఖ విభాగంలో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. 2022లో కాజల్ అనే యువతి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో ఆమెను స్వాట్ కమాండ్ విభాగంలో విధులు నిర్వహిస్తోంది. 2023లో అంకూర్, కాజల్ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మోహన్ గార్డెన్స్‌లో అంకూర్, కాజల్ నివసిస్తున్నారు. గత కొంత కాలంగా దంపతుల మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాజల్ నాలుగు నెలల గర్భవతిగా ఉంది. దంపతులు మధ్య గొడవ జరగడంతో కాజల్ తలపై డంబెల్‌తో భర్త బాదాడు. ఆమె రక్తపు మడగులో పడడంతో ఆమె సోదరుడు నికిల్‌కు అంకూర్ ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని సమాచారం ఇచ్చాడు. వెంటనే నికిల్ స్థానిక పోలీసులను తీసుకొని ఇంటికి చేరుకొని రక్తపు మడుగులో చెల్లిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో ఘజియాబాద్‌లోని మరొక ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ కాజల్ మృతి చెందింది. కట్నం కోసం గత కొంతకాలం అల్లుడు, కుటుంబ సభ్యులు తన కూతురిని వేధిస్తున్నారని కాజల్ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. అంకూర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Next Story