నాగర్ కర్నూల్‌లో అప్పు అడిగినందుకు.. మహిళను బొలెరోతో ఢీకొట్టి చంపిన బంధువు

నాగర్ కర్నూల్: అప్పు ఇచ్చి అడిగినందుకు ఓ మహిళను దూరపు బొలెరో వాహనం తొక్కించి చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు ప్రాంతంలోని కొత్త చెరువు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... తెలకపల్లి మండలం రాకొండకు బంగారమ్మ(43) అనే మహిళ నివసిస్తోంది. తాడూరులోని దూరపు బంధువు భీమయ్యకు కొంత డబ్బు బంగారమ్మ అప్పుగా ఇచ్చింది. పలుమార్లు డబ్బులు అడిగినప్పటికి తరువాత ఇస్తానని చెప్పి భీమయ్య కాలం వెళ్లదీసున్నాడు. బంగారమ్మ కూలి పని కోసం భీమయ్య చేనుకు వెళ్లింది. అక్కడ డబ్బులు ఇవ్వాలని భీమయ్యను ఆమె మందలించడంతో కోపంతో అతడు రగిలిపోయాడు. వెంటనే బొలెరో వాహనంతో ఆమెను ఢీకొట్టి అనంతరం బంగారమ్మ పైనుంచి పోనివ్వడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. వెంటనే నిందితడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
-
Home
-
Menu
