50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన తహసీల్దార్

ప్రజలు ప్రభుత్వ కార్యాలయల్లో తమ సమస్య లు పరిస్కారించడం కోసం ఎవరికీ లంచాలు ఇవ్వవద్దని ఎవరైనా లంచం అడిగితె 1604 నెంబర్ కు కాల్ చెయ్యాలని అవినీతి నిరోధక శాఖ డిఎస్పి శేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం నాగిరెడ్డి పేట తహసీల్దార్ కార్యాలయం పై డిఎస్పి తో పాటు, సిఐ లు వేణుకుమార్, నగేష్ లతో పాటు తన సిబ్బంది తో తహసీల్దార్ కార్యాలయం పై దాడి చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, అతని అసిస్టెంట్ అజయ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ రైతు తన వారస్వత్వ భూమిని తన పేరు పై పట్టా చేయమని తహసీల్దార్ కార్యాలయం కు వస్తే తహసీల్దార్ 50 వేలు డిమాండ్ చేశాడని తెలిపారు. బాధితుడు తమకు పిర్యాదు చెయ్యగా లంచం తీసుకుంటుండగా కార్యాలయం లో పట్టుకున్నామన్నారు.
తహసీల్దార్ శ్రీనివాస్ రావు, డబ్బులు తన అసిస్టెంట్ కు ఇవ్వమని చెప్పారన్నారు. శ్రీనివాస్ రావు లంచం తీసుకున్న సంఘటనే కాకా కార్యాలయం లోని రికార్డులను, ఇంతకు ముందు చేసిన పట్టాలను, ఆయన సంపాదించిన ఆస్తులు వివరాలపై మధ్యామ నుండి సాయంత్రం వరకు కార్యాలయం తలుపులు మూసి పోలీస్ లను బయట కాపలా పెట్టి విచారణ జరిపారు. తహసీల్దార్ కార్యాలయం లో తీసుకున్న లంచంతో పాటు హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో ఉన్న తహసీల్దార్ ఇంటి పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి విచారణ జరిపారు. బ్యాంకు ల ఖాతా లను ఇంట్లో ఉన్న ఆభర్ణలను ఆయన ఆస్తులపై పూర్తి విచారణ జరిపినట్లు డిఎస్పి తెలిపారు.
-
Home
-
Menu
