రైతుపై అనుచిత వ్యాఖ్యలు.. తహశీల్దార్ సస్పెన్షన్

రైతుపై అనుచిత వ్యాఖ్యలు.. తహశీల్దార్ సస్పెన్షన్
X

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీ్ల్దార్ చిట్టంపల్లి స్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఓ రైతును ఉద్దేశించి తహశీల్దార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘నువ్వింకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?’’ అని మాట్లాడినట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలంటూ రైతులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆర్డివొ ప్రాథమిక నివేదిక ఆధారంగా తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు.

Tags

Next Story