మామ ప్రాణం తీసిన కోడలి అక్రమ సంబంధం... నడిరోడ్డుపై తగలబెట్టాడు

Tamilnadu, Cuddalore
X

చెన్నై: కోడలి అక్రమ సంబంధానికి మామ అడ్డుగా ఉండడంతో అతడిని నడిరోడ్డులో తగలబెట్టిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పన్రుటి ప్రాంతంలో రాజేంద్రన్ అనే అనే రైతు తన కుమారుడికి జయప్రియ అనే మహిళతో పెళ్లి చేశాడు. కొన్ని రోజుల క్రితం కుమారుడు చనిపోవడంతో జయప్రియ మరోక వ్యక్తి మణికందన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కోడలు వివాహేతర సంబంధం మామకు తెలియడంతో ఆమెను వ్యతిరేకించాడు. దీంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మణికందన్ కూడా ప్రియురాలి మామ మందలించడంతో అతడిపై ఆగ్రహంతో రగిలిపోతున్నాడు.

జనవరి 29న తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా మణికందన్ తన అనుచురులతో కలిసి వారిని అడ్డుకున్నారు. రాజేంద్రన్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మంటల్లో చిక్కుకున్న రాజేంద్రన్ ప్రాణభయంతో రోడ్డుపై పరుగుల తీశాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రికార్డయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జనవరి 31 అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేససుకొని దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితుడు మణికందన్ తో పాటు కోడలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags

Next Story