ఇవాళ కూతురు పెళ్లి.... రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

Tandur Vikarabad
X

Tandur Vikarabad 

వికారాబాద్: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగుతున్నాయి. కన్న కూతురుకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సగెంకుర్దు గ్రామంలో అనంతప్ప అనే వ్యక్తి తన కూతురు అవంతి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. దగ్గర బంధువుతో ఆదివారం పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి పనులలో భాగంగా అనంతప్ప యాలాల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా అతడి బైక్ స్కిడ్ అయ్యింది. వెంటనే అతడిని తాండూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్సనిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో మృతదేహాన్ని సొంతూరు తీసుకొచ్చారు. పెళ్లి కోసం వేసిన టెంట్ కిందనే తండ్రి మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సగెంకుర్ధు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags

Next Story