ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్.. ఎడుగురు మృతి

ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్.. ఎడుగురు మృతి
X

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సంగారెడ్డి జిల్లాలో ముంబై జాతీయ రహదారి నెత్తురోడింది. మంగళవారం సాయంత్రం వరుసగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణం చెందారు. జహీరాబాద్ సమీపంలో మొగుడంపల్లి (మం) సత్వార్ గ్రామ శివారులో యూ టర్న్ వద్ద ఆటోని ట్యాంక ర్ ఢీకొట్టగా.. ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతులంతా కర్ణాటకలోని రాజగిరి వాసులుగా గుర్తించారు. కూలీ పనుల కోసం వచ్చి ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మృతులను రేఖ, శ్రీదేవి, కవిత, రేష్మతో పాటు ఆటో డ్రైవర్ దేవదాస్‌గా గుర్తించారు. కాగా, నిర్మల, నిఖిత, తుల్జమ్మ, చంద్రకళ, రాధిక, శిల్ప, శోభలు గాయపడినవారిలోఉన్నారు. క్షతగాత్రులను జహీరాబాద్‌లో ప్రథమచికిత్స అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ పరితోష్ పంకజ్ సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షిం చారు. కోహిర్ మండలం వెంకటాపూర్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

Tags

Next Story