ప్రమాదాలకు అడ్డాగా.. రైల్వే అండర్ బ్రిడ్జి

ప్రమాదాలకు అడ్డాగా.. రైల్వే అండర్ బ్రిడ్జి
X

కొత్తగూడెంలోని రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు చేరడం వల్ల, రోడ్డుపై గుంతలు పడటం వల్ల, మరియు సిమెంట్ రోడ్డు నుండి ఇనుప కడ్డీలు బయటకు రావడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. భారీ వాహనాలు మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. గురువారం ఉదయం 5 గంటల సమయంలో అండర్ బ్రిడ్జి వద్ద యాష్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ అతివేగంగా నడపడమేనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Tags

Next Story