సంగారెడ్డిలోని తారా కాలేజీలో యువతిపై దాడి... చున్నీతో చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి

సంగారెడ్డిలోని తారా కాలేజీలో యువతిపై దాడి... చున్నీతో చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి
X

సంగారెడ్డి: ముఖానికి మాస్కులు ధరించి ఇద్దరు యువకులు తారా డిగ్రీ కాలేజీలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై దాడి చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుల్కల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని (20) సంగారెడ్డి జిల్లా కేంద్రం తారా డిగ్రీ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇద్దరు యువకులు ముఖానికి మాస్కులు ధరించి కాలేజీలోకి ప్రవేశించారు. రెండో అంతస్తు చేరుకొని విద్యార్థినిపై దాడిచేయడంతో ఆమె మూడో ఫ్లోర్‌లోకి పారిపోయింది. యువకులు వెంటపడి ఆమెపై దాడి చేసి చేతులు కాళ్లు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం ఫోన్ తీసుకొని వీడియోలు ఆమె తండ్రికి పంపించారు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాలేజీకి చేరుకొని స్పృహతప్పి పడిపోయిన యువతిని ఆస్పత్రికి తరలించారు. సదరు విద్యార్థినికి చెందిన ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి తీసుకొని అసభ్యకర వీడియోలను ఇద్దరు యువకులలో ఒకరికి పంపారు. దీంతో యువతి కోసం గత కొన్ని రోజుల నుంచి యువకులు వెతుకుతున్నారు. కాలేజీకి చేరుకొని యువతిపై దాడిచేసినట్టు సమాచారం. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Tags

Next Story