జనగామలో కోడికూర గొడవ... తండ్రిని చంపిన తనయుడు

Tarigoppula Jangaon
జనగాం: కోడి కూర వండలేదని భార్య-భర్తల మధ్య గొడవ జరగడంతో తండ్రిని కుమారుడు కర్రతో కొట్టడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అక్కరాజుపల్లి గ్రామంలో జంగిటి రమేష్(42), అనూష అనే దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం నాటు కోడి కూర వండాలని భార్యకు భర్త చెప్పాడు. ఇప్పటికే చేపల కూర వండానని, ఇప్పడు వండలేనని ఖరాఖండిగా చెప్పింది. దంపతుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కుమారుడు గణేష్ వారిద్దరిని శాంతపరచడానికి ప్రయత్నించాడు. క్షణికావేశంలో గణేష్ రోకలిబండ తీసుకొని తండ్రి తలపై బాదాడు. రమేష్ తీవ్రంగా గాయపడడంతో పక్కింటి వారు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే తండ్రి చనిపోయాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు గణేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
-
Home
-
Menu
