వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
X

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖిలావరంగల్ మండలం మామునూరు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

మత్తులో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను శ్రీపతి వంశీ, శ్రీపతి రాజుగా గుర్తించారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story