వరదలో కొట్టుకుపోయిన ఎంఎలఎ,అధికారులు

వరదలో కొట్టుకుపోయిన ఎంఎలఎ,అధికారులు
X

ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద పరిస్థితులను సమీక్షించేందుకు శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులు ఒక్కసారిగా పెరిగిన ప్రవాహానికి వరద నీటిలో కొట్టుకుపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఆకస్మిక ప్రమాదాన్ని గ్రహించిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే అప్రమత్తమై లైఫ్ బోట్ల సాయంతో అత్యంత సాహసోపేతంగా ఎమ్మెల్యే సహా అధికారులందరినీ రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరోవైపు, పార్వతీపురం మన్యం జిల్లాలో వరద ముంపులో చిక్కుకున్న భూమిక

అనే తొమ్మిది నెలల గర్భిణీని కూడా ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది లైఫ్ జాకెట్ వేసి సురక్షితంగా కాపాడి, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి తమ సమయస్ఫూర్తిని చాటుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదులకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఆ నదులు ఉధృత్తంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలైన మడ్డువలస, తోటపల్లి జలాశయాలు నుంచి వరద చేరడంతో నాగావళికి నీటిమట్టం భారీగా పెరిగింది. నాగావళి నదికి సుమారు 90 వేల నుంచి అక్ష క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Tags

Next Story