అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టిన టిడిపి అల్లరి మూకలు

అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టిన టిడిపి అల్లరి మూకలు
X

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు రాష్ట్రం సిద్దార్ నగర్ లో టిడిపి శ్రేణులు దారుణానికి పాల్పడ్డారు. గుంటూరు శనివారం సాయంత్రం వైసిపి నేత, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇంటికి వంద మంది రౌడీలు నిప్పు పెట్టారు. పోలీసుల సమక్షంలోనే అంబటి రాంబాబు ఆఫీసు మీద దాడి జరిగింది. టిడిపి శ్రేణులు అంబటి ఇంట్లోకి చొచ్చుకెళ్లి అద్దాలు పగలగొట్టి, కారు ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు బండబూతులు తిటారు. కాలనీ వాసులు భయంతో వణికిపోయారు. ఎం జరుగుతుందో అనే ఆందోళనతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అంబ‌టిని అరెస్ట్ చేసిన వెంటనే ఆయన ఇంటిపై టిడిపి అల్ల‌రి మూక‌లు కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడులకు పాల్పడ్డారు. అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణం భయంతో ఇంట్లోనే దాక్కున్నారు.

అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టులో ఆమె హౌస్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. అంబటి రాంబాబుతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పిటిష‌న్‌ వేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని. శాంతిభద్రత సమస్య ఉందని కోర్టుకు అప్పీల్‌ చేయడంతో పాటు 24 గంటలు భద్రత కల్పించాలని విజయలక్ష్మి కోరారు. తక్షణం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. గుంటూరు జిల్లా పశ్చిమ ఎంఎల్ఎ గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు నేతృత్వంతో ఈ దాడి జరిగిందని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అసభ్య పదాలు, అసహ్య పదాలతో దూషించడంతోనే ఆయనపై ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.

Tags

Next Story