‘లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి నవ్వుతూ వెళ్తారు

రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ఈ మూవీకి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత కె. హిమబిందు మాట్లాడుతూ .. ‘ఎన్నో కష్టాలు, ఎంతో ఖర్చు పెట్టి ‘లగ్గం టైం’ని నిర్మించాం. ’లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి మనస్ఫూర్తిగా నవ్వుతూ వెళ్తారని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను” అని అన్నారు.దర్శకుడు ప్రజోత్ కె వెన్నం మాట్లాడుతూ .. “లగ్గం టైం’ మూవీని టీం అంతా కలిసి చాలా బాగా తీశాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అందరూ చూసి మెచ్చుకునేలా మా సినిమా ఉంటుంది’ అని తెలిపారు.ఈ కార్యక్రమం లో హీరో రాజేష్ మేరు, కృష్ణ ప్రసాద్, విశ్వనాధ్ కూచనపల్లి, పవన్ తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
