టీం ఇండియాకు ఝలక్ ఇచ్చిన ఐసిసి

సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్‌కి ముందు టీం ఇండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లకు భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశిత సమయం కంటే రెండు ఓవర్లు వెనకబడింది. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున పది శాతం మ్యాచ్ ఫీజ్‌ను టీం ఇండియాకు జరిమానాగా విధించారు.
ఐసిసి ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి 5 శాతం కోత విధిస్తారు. అయితే ఈ జరిమానాను కెప్టెన్ కెఎల్ రాహుల్ అంగీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ లేకుండా ఈ కేసు ముగిసింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని 1-1గా సమం చేసింది. కానీ, వైజాగ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించి.. 2-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
Tags
-
Home
-
Menu
