వీల్‌చైర్‌లో అసెంబ్లీకి తేజస్వియాదవ్

వీల్‌చైర్‌లో అసెంబ్లీకి తేజస్వియాదవ్
X

ఆర్‌జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వియాదవ్ సోమవారం బొటనవేలి గాయంతో వీల్‌చైర్‌లో బీహార్ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హాజరైన యాదవ్ గవర్నర్ ప్రసంగం తరువాత పాత్రికేయులతో మాట్లాడుతూ తన ఎడమ కాలిబొటనవేలు గాయమైందని , నడవడం కష్టం కావడంతో వీల్‌చైర్‌లో వచ్చానని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినదేనని విమర్శించారు. అభివృద్ధి విషయంలో బీహార్ వెనుకబడి ఉన్నప్పటికీ ప్రసంగం అందంగా రంగు పూశారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా పాలన సాగిస్తున్నా అత్యాచారాలు, హత్యలు, ఇతర నేరాలు కొనసాగుతూనే ఉన్నాయని, శాంతిభద్రతలు లోపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లు ఎన్నికల స్టంట్లుగా దిగజారాయని ఆరోపించారు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధుబని చీర ధరించారని, ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నందున ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నందున మంత్రి సీతారామన్ కాంజీవరం చీర ధరించారని వ్యాఖ్యానించారు. ఈలోగా యాదవ్ విరోధులైన తోబుట్టువులు పెద్దక్క రోహిణీ ఆచార్య “ శరీరానికి గాయమైతే బాధ కలుగుతుంది. కానీ హృదయాన్ని గాయపరిస్తే ఇంకా విపరీతమైన నిస్పృహ కలుగుతుంది ” అని యాదవ్‌ను ఉద్దేశించి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. జేడీ(యు) నేషనల్ జనరల్ సెక్రటరీ , రాష్ట్రమంత్రి అశోక్ చౌదరి తేజస్వియాదవ్‌ను ఉద్దేశించి “ యాదవ్ ఉత్త కాళ్లతో క్రికెట్ ఆడుతుంటాడు. అతను తప్పకుండా షూలతో ఆడడం అలవాటు చేసుకోవాలి ” అని వ్యాఖ్యానించారు.

Tags

Next Story