రేపు పోలింగ్

రేపు పోలింగ్
X

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రెండో విడత ఎన్నికల ప్రచా రం 12న, మూడో విడత ప్రచారం ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటల ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) తెలిపింది. ప్రచారం ముగిసిన తర్వాత బ హిరంగ సమావేశాలు, ఎలక్ట్రానిక్ మీడి యా, రేడియోలలో ప్రచారం నిర్వహించ డం పూర్తిగా నిషేధం అని ఎస్‌ఇసి కార్యద ర్శి ఎం.మకరందు తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తెలిపారు. మొదటి విడత లో 4,236 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు ఎ న్నికలు జరుగనున్నాయి. ఈనెల 11వ తేదీ న పోలింగ్ 189 మండలాలలో 37,562 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 27 నుంచి 29 వరకు తొలి విడత పోలింగ్‌కు నామినేషన్లు స్వీకరించారు. తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు 395 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన

స్థానాలకు 13,127 అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 37,440 వార్డు స్థానాలకు 67,893 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. మొదటి విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 27,41,070 మంది, మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయనుండగా.. తిరిగి 11న సాయంత్రం తెరుచుకోనున్నాయి.

Tags

Next Story