ఎసిబి వలలో మరో అవనీతి చేప

మంచిర్యాల జిల్లాలో ఎసిబి వలలో మరో అవినీతి చేప చిక్కింది. కొమురం భీం జిల్లా ఇన్‌ఛార్జి జిల్లా సహకార సంఘం అధికారి (డిసిఓ) రాథోద్ బిక్కు మంచిర్యాలలోని తన నివాసంలో శనివారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బెజ్జూర్ సహకార సంఘంలో సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగి జక్కుల వెంకటేశ్వర్‌గౌడ్ ఉద్యోగ విషయంలో జిల్లా ఇన్‌ఛార్జి సహకార సంఘం అధికారి రాథోడ్ బిక్కును సంప్రదించాడు. ఇందుకు ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే, బాధితుడు రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని రెండు విడతలలో డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ విషయమై బాధితుడు ఎసిబి అధికారులకు తెలియజేశాడు. వారి సూచనల మేరకు శనివారం ఎసిబి అధికారులు డిసిఒ రాథోడ్ బిక్కు నివాసంలో వెంకటేశ్వర్‌గౌడ్ రూ.2 లక్షలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
-
Home
-
Menu
