వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana Assembly winter session in Dec
X

Telangana Assembly winter session in Dec

రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావించారు. అయితే ఈ నెల 11న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుండడం, అనంతరం మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక జరగనున్నందున అనుకున్న తేదీ కాకుండా మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలాఉండగా బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏ తేదీలను ఖరారు చేసినా, వెంటనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి శనివారం సంబంధిత అధికారులతో సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు. మరోవైపు నాటి నిజాం కాలం నాటి భవనాన్ని కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు అవసరమైన విధంగా స్వల్ప మార్పులు చేసి, తుది మెరుగులు దిద్దుకుంటున్నది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించే రోజు వరకు సిద్ధం అయ్యేలా అధికారులు పనులు వేగవంతం చేయించారు.

Tags

Next Story