మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అమెరికా అమ్మాయి.. నస్పూర్ అబ్బాయి

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అమెరికా అమ్మాయి.. నస్పూర్ అబ్బాయి
X

ప్రేమ కు ఎల్లలలు లేవు&హద్దులు కూడా లేవు. మన దేశపు అబ్బాయి పరదేశి అమ్మాయిని ప్రేమించగా అబ్బాయి తల్లితండ్రులు, అమ్మాయి తల్లి తండ్రులు వారి ప్రేమకు ఒప్పుకుని భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా వేద మంత్రాల సాక్షి గా వారి కి వివాహాం జరిపించి ఒకింటి వారిని చేసారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామానికి చెందిన సింగరేణి గని కార్మికుడు గంగిపెల్లి రాములు కమల ప్రథమ పుత్రుడు గంగిపెల్లి ప్రణీత్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అమెరిక వాస్తవ్యులు గ్రియర్ చెర్యల్ ఏకైక పుత్రిక లవినిశ్రీ(తమీ) లు అమెరికాలో ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరువైవుల వారు అంగీకరించారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక మండపంలో వారికి భారతీయ పద్ధతిలో వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య వివాహం జరిపించారు. 10 రోజుల క్రితమే అమెరికా నుండి లవనశ్రీ తమ కుటంబ సభ్యులతో మంచిర్యాల జిల్లాకు చేరుకున్నారు.

ఐదు రోజుల క్రితం నస్పూర్ లో అసలైన పెళ్లి ఆచారాల ప్రకారం అన్ని కార్యక్రమాలు చేపట్టగా పరదేశీ అతిధులు అన్ని కార్యాక్రమాల్లొ పాల్గొని భారతదేశ సంప్రదాయలను చూసి ముగ్ధులయ్యారు. నేటి వివాహా వేడుకలు పాశ్చాత్య పోకడలకు పోతున్న నేపధ్యంలో అమెరికా నుండి వచ్చిన వారు భారతీయ సంస్కృతి సంప్రాదాయలను గౌరవిస్తూ చీర కట్టు తో మురిసి పోయారు. పెళ్లి పందిరిలో వారే భారతదేశ పౌరులుగా కట్టు, బొట్టుతో అలరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయం మాటల్లో చెప్పలేనిదని, ఇక్కడి ఆచారాలు మంత్రముగ్ధులను చేశాయని ఆనందం వ్యక్తం చేసారు. స్థానికులు వారితో చేసిన సందడి మరింత ఆనందాన్నిచ్చింది. వారితో స్థానికులు సెల్ఫీలు తీసుకుని సంబరాలు జరుపుకున్నారు. మంచిర్యాలలోని పద్మనాయక మండపంలో అమెరికా అమ్మాయి, నస్పూర్ అబ్బాయి వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది.

Tags

Next Story