అయ్యప్ప వద్దకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. దంపతులు మృతి

Telangana Couple
X

మంచిర్యాల: శబరిమల అయ్యప్ప మకరజ్యోతి దర్శనం చేసుకొని అటు నుంచి కన్యాకుమారికి వెళ్లిన దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట పట్టణానికి చెందిన పాలకుర్తి సత్యనారాయణ(63), రమా (59) జనరల్ స్టోర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 8న అయ్యప్ప మాలలో ఇద్దరూ ఓ ప్రైవేటు సర్వీసులో శబరిమల దర్శనానికి వెళ్లారు. 15న మకర సంక్రాంతి రోజున దర్శనం చేసుకొని అక్కడి నుంచి కన్యాకుమారికి వెళ్లారు. సముద్ర స్నానం అక్కడి దేవాలయాలు దర్శించిన అనంతరం టూరిస్ట్ బస్సు ఉన్న చోటికి వచ్చే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. దంపతులు ఇద్దరిని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ, రమాలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు,

Tags

Next Story