మూడోసారి రిక్త హస్తమే

రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను కలిపే ప్రాజెక్టులకు నిధులు హుళక్కి
గోదావరి మూసీ అనుసంధానానికి నిధులు ఇవ్వని కేంద్రం బడ్జెట్‌లో అడుగు ముందుకు
పడని కీలక ప్రాజెక్టులు కేంద్ర కేటాయింపులపై తెలంగాణ ఆశలు ఆవిరి
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్ర మూడోసారీ రిక్తహస్తం చూపింది. విభజన చట్టంలోని హామీలతో పాటు దాదాపు 12 కీలక శాఖలకు సంబంధించిన 47 అంశాల చిట్టా ఇప్పటికే కేంద్రం ముందు ఉంచిన తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా వాటికి మోక్షం లభిస్తుందని భావించినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. హైదరాబాద్ విశ్వ నగర విస్తరణకు మౌలిక సదుపాయాలకు భారీ ఊతమిచ్చే కీలక ప్రాజెక్టుల పైన కేంద్రానికి కీలక ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో వాటి పైన ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావించింది. మొత్తం 34 వేల 367 కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను కలిపే 45 వేల కోట్ల విలువైన రేడియల్ రోడ్ల ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రాన్ని కోరుతున్న తెలంగాణ ఈ బడ్జెట్లో కేటాయింపులపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. హైదరాబాద్ మెట్రో రెండవ దశ విస్తరణకు, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రై నేజీ, 17 వేల కోట్లతో నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవే, గోదావరి మూసీ అనుసంధానానికి 6 వేల కోట్లు, అనే క కీలక ప్రాజెక్టుల పైన ఆశలు పెట్టుకుంది. అంతే కాకుండా విభజన హామీ అయిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, 8 కొత్త రైల్వే లైన్ల మంజూరు పైన తెలంగాణ ఆశగా ఎదురుచూసినా నిష్ప్రయోజనమే మిగిలింది.
తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాలతో పాటు, తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా ఐఐ ఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల వంటి సంస్థలు మంజూరవుతాయని ప్రభుత్వం ఆశించినా ఎలాంటి ప్రకటనా రాలేదు. గత కొన్నేళ్లుగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు తక్కువగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో విఫలమవుతున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో ఏపీకి రూ.9,417 కోట్ల నిధులు కేటాయిస్తే, తెలంగాణకు మాత్రం రూ. 5,337 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. 2023 -24 నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యా యం జరుగుతోంది.
పుష్కరకాలమైనా అరకొర నిధులే
తెలంగాణ రాష్ట్రం దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. నీతి ఆయోగ్ రిపోర్ట్‌లు, ఆర్థిక సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పైగా జీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) 5 శాతం సమకూరుస్తు న్న రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్ నామమాత్రంగా ఉండ టం గమనార్హం. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్ విస్తీర్ణం 69 వేల కిలోమీటర్ల పైనే. అయితే తెలంగా ణ రాష్ట్రంలో మాత్రం అది 2,014.61 కిలోమీటర్లే. ఇది దేశ రైల్వే నెట్‌వర్క్‌లో 3 శాతమే. ప్రత్యేక రా ష్ట్రంగా ఏర్పడి దాదాపు పుష్కరకాలం అవుతున్నప్పటికీ రైల్వే మౌలిక సదుపాయాల లోటును పూడ్చేందుకు కేంద్ర బడ్జెట్‌లో సరిపడా నిధులను కేటాయిస్తున్న పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాక, వాటి మంజూరులో రైల్వే శాఖ ఏళ్ల తరబడి జాప్యం చేస్తోంది. వీటిని అధిగమించాక టెండర్లు పిలిచేందుకూ ఏళ్లు పడుతోంది. అయితే భూసేకరణలో జాప్యం, అంతర్రాష్ట్ర సమన్వయలోపం, రాష్ట్ర వాటా నిధుల్లో ఆలస్యం తదితర అం శాలూ కారణాలుగా ఉన్నట్లుగా రైల్వేశాఖ వర్గాలు వివరిస్తున్నాయి.
రూ.23 వేల కోట్లు నిధులు అవసరం
తెలంగాణలో ప్రస్తుతం 6 కొత్త లైన్లు, 14 డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు రూ.23 వేల కోట్లు ని ధులు కావాలి. సర్వే దశలో ఉన్నటువం టి ప్రతిపాదిత ప్రాజెక్టుల విలువ రూ. 49 వేల కోట్లకు పైమాటే. అయితే 2025- 26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5,336 కోట్లు మాత్రమే కేటాయించింది. 2014 సంవత్సరానికి ముందుతో పోల్చితే తమ హయాంలో నిధుల కేటాయింపు తెలంగాణ రాష్ట్రానికి పెరుగుతోందని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నా యి. అయితే దశాబ్దాలుగా కొనసాగుతున్న లోటును భర్తీ చేయాలంటే మా త్రం నిధుల కేటాయింపు భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి 2,343 హెక్టార్ల భూ సేకరణకు 1,580 హె క్టార్లను మాత్రమే సేకరించారు. 2016-17లో మం జూరైన మనోహరాబాద్- కొత్తపల్లి ప్రాజెక్టు (151.36 కి.మీ.) పనులు పుష్కరకాలమైనా సగ మే పూర్తయ్యాయి. 130.28 కిలోమీటర్లు వికారాబాద్- కృష్ణా కొత్త ప్రాజెక్టు మంజూరుకు కేంద్రం అ నాసక్తి చూపగా భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. 126 కి లోమీటర్ల కల్వకుర్తి-మాచర్ల ప్రాజెక్టును మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఎ లాంటి ప్రకటన ఈ బడ్జెట్‌లో లేకపోవడం విశేషం.
-
Home
-
Menu
