హుస్నాబాద్ కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం సంతోషం: పొన్నం

Telangana Public School has been sanctioned for Husnabad
X

Telangana Public School has been sanctioned for Husnabad

హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ విద్యారంగ అభివృద్ధికి ఇది మరో ముందడుగు పడిందని కొనియాడారు. చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక చేసి, అభివృద్ధికి రూ.9.62 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక మౌలిక వసతులతో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పాఠశాల ద్వారా చిగురుమామిడి మండలంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తుకు మరింత మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని పొన్నం స్పష్టం చేశారు.

Tags

Next Story