గిన్నీస్ రికార్డు లో గ్లోబల్ సమ్మిట్ డ్రోన్ షో

గిన్నీస్ రికార్డు లో గ్లోబల్ సమ్మిట్ డ్రోన్ షో
X

భారత్ ఫ్యూచర్ సిటిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రోన్ షో గిన్నీస్ రికార్డుల్లోకెక్కింది. తెలంగాణ రైజింగ్..కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాల సమూహంతో డ్రోన్ షో నిర్వహించారు. ఈ డ్రోన్ షోలో తెలంగాణ రైజింగ్ 2047 లక్షాలను వివరించే విధంగా థీమ్‌లను ప్రదర్శించారు. మూడు వేల డ్రోన్లతో థీమ్ షో అతిధులను మైమరపింప చేసింది. మూడు వేల డ్రోన్లతో షో నిర్వహించడం ప్రపంచ రికార్డుగా గిన్నీస్ రికార్డులో నమోదు చేసి, గిన్నీస్ సంస్థ ప్రతినిధులు అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఇప్పటి వరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవయిన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అబుదాబీ పేరిట ఉంది. ఈ సంవత్సరం (2025) నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2,131 డ్రోన్లతో హ్యాపీ న్యూయర్ అనే వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డు అందుకుంది. అంతకు మించిన సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో నిర్వహించిన అద్భుతమైన డ్రోన్ షో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని గగనతలంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డును అధిగమించింది.

Tags

Next Story