ఎస్ఎస్సి మెమోలో పేరు, తేదీ సవరణ

తరగతి (ఎస్ఎస్సీ) మెమోల్లో పేరు, పుట్టిన తేదీల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈ. నవీన్ నికోలస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత వ్యక్తులు అవసరమైన ధ్రువపత్రాలతో సమీపంలోని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులో సవరణలకు సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేయడంతోపాటు, అవసరమైన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అందిన దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ నిబంధనలు, నిర్దేశిత విధానాల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తుల ప్రక్రియ సులభతరం అవుతుందని, విద్యార్థులు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
-
Home
-
Menu
