విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి

విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి
X

అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన ఉడుమల సహజారెడ్డి(24) అనే యువతి.. అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. సహజారెడ్డిది జననగాం జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం గుంటూరుపల్లి గ్రామం. నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె బర్మింగ్‌హామ్ ప్రాంతంలో ఉంటుందోంది. అయితే, గురువారం తన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సహజారెడ్డి.. మంటల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచింది. దీంతో సహజారెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహజారెడ్డి మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యువతి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ.. వారితో సంప్రదింపులు జరుపుతున్నామని.. అవసరమైన సాయాన్ని అందిస్తామని వెల్లడించింది.


Tags

Next Story