సబ్‌రిజిస్ట్రార్‌ల రియల్ దందా!

సబ్‌రిజిస్ట్రార్‌ల రియల్ దందా!
X

బినామీల పేర్లతో బెంగళూరు, దుబాయ్‌లో పెట్టుబడులు..!

మరికొందరు నగర శివార్లలో ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల కొనుగోళ్లు

ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ నివేదిక

నిఘా పెట్టిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కొందరు స బ్ రిజిస్ట్రార్‌లు, డిఆర్‌లు కలిసి ఈ రియల్ వ్యాపారం చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది. కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు బెంగళూరులో, మరికొందరు సబ్ రిజిస్ట్రార్‌లు దుబాయ్‌లో రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని సబ్ రిజిస్ట్రార్‌లు, డిఆర్‌లు ఇందులో భాగస్వాములు అయినట్టుగా తెలిసింది. ఈ రియల్ వ్యాపారం గురించి కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలిసింది. తెలంగాణలో రియల్ వ్యాపారం చేస్తే దొరికిపోతామన్న భయంతోనే వేరే రాష్ట్రాలు, దేశాల్లో సబ్ రిజిస్ట్రార్ లు, డిఆర్‌లు పెట్టుబడులు పెడుతున్నట్టగా సమాచారం. ఇప్పటికే పలువురు సబ్ రిజిస్ట్రార్‌లపై ని ఘా పెట్టిన ప్రభుత్వం వారి ఆస్తుల వివరాల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా తెలిసింది.

రెండేళ్ల క్రితం రెవెన్యూ మంత్రికి అందరి అవినీతి చిట్టాను అందచేసిన ఓడిఆర్ ప్రస్తుతం ప్రభుత్వ భూ ములకు బై నెంబర్‌లు వేసి, నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్ చేయించి భారీ స్థాయి లో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుతం మంత్రి పొంగులేటికి ఫిర్యాదు చేసినట్టు గా సమాచారం. దీంతోపాటు ఆ డిస్ట్రిక్ రిజిస్ట్రార్ చేసే రియల్‌వ్యాపారం గురించి కూడా మంత్రికి కొందరు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ప్రస్తు తం ఈ డిఆర్ రంగారెడ్డి జిల్లాకు ఇన్‌చార్జీగా రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని, తన కు మంత్రి చాలా దగ్గరని కచ్చితంగా రంగారెడ్డి డిఆర్ పోస్టుకు బదిలీ అవుతానని ఆ శాఖ ఉద్యోగుల వద్ద ఆయన పేర్కొంటున్నట్టుగా తెలిసింది.

ఇప్పటికే ఏసిబి నిఘా ఉన్న ముగ్గురు సబ్ రిజిస్ట్రార్‌లు త మ బంధువు ల పేర్లతో హైదరాబా ద్ శివార్లలో ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, వ్యవసాయ భూము లు కొనుగోలు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందా యి. ఇప్పటికే వారిపై ఏసిబి నిఘా ఉండడం తో బినామీల పేర్లపై అలాగే ఉంచాలని వారు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇలా, ప్రభుత్వానికి దొ రకకుండా సబ్ రిజిస్ట్రార్‌లు కొత్త ఎత్తుగడలు వేసి నా కొందరు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వం గుర్తించినట్టుగా సమాచారం. దీంతోపాటు కొందరు సబ్ రిజిస్ట్రార్‌లకు ఏసిబి అధికారులతో బంధుత్వం ఉండడంతో దానిని తమకు అనుకూలంగా మలుచుకొని అక్ర మ ఆస్తుల కేసుల్లో సబ్ రిజిస్ట్రార్‌లు దొరకకుండా తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్‌ఎండిఎ పరిధిలోని ఓ డిఆర్‌పై ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చినా ఆయనకు డిఐజి పదోన్నతి ఎందుకు కట్టబెడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

మూసాపేట జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసిన సమయంలోనే ఈ డిఆర్‌ను సస్పెండ్ చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశించినా ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ డిఆర్‌పై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఏసిబి కూడా ఆయనపై దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈయన మంత్రి బంధువని చెప్పుకొని గతంలో అవినీతికి పాల్పడ్డారని, అయినా ఈయన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకోవడం గమనార్హం.

ఈ అధికారి ఖర్చుల బాధ్యత సబ్ రిజిస్ట్రార్‌లదే..

ఓ మంత్రి పేషీలో పనిచేసే ఓ అధికారి ఇచ్చే లీకులతో సబ్ రిజిస్ట్రార్‌లు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారని తెలిసింది. ఈ అధికారి తాను చేసే షాపింగ్, కారు సర్వీసింగ్, ఇతర ఖర్చులు సబ్ రిజిస్ట్రార్‌లే భరిస్తున్నారని సమాచారం. ఇలా ఆ అధికారి ఏ పర్యటనకు వెళ్లినా సబ్ రిజిస్ట్రార్‌లే ఖర్చులను సమకూర్చాల్సి వస్తుందని ఆ శాఖ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ అధికారి అవినీతి ఆగడాలు ఎక్కువ కావడంతో కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు మంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఇలా ఈ అధికారి ఇచ్చే లీకులతో సబ్ రిజిస్ట్రార్‌లు అందినకాడికి దోచుకుంటున్నారని, ఆరోపణలు వచ్చిన సబ్ రిజిస్ట్రార్‌లకు ఈ అధికారి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు.

ముందుకు సాగని పదోన్నతులు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతుల ఫైలు ముందుకు కదలడం లేదు. గ్రేడ్1 సబ్ రిజిస్ట్రార్, గ్రేడ్2 సబ్ రిజిస్ట్రార్, డిఆర్, డిఐజీల పదోన్నతులు మరింత ఆలస్యం అవుతున్నాయి. పలువురు రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉండడంతో తమకు పదోన్నతులు లభిస్తాయో లేదోనన్న ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు ఉద్యోగుల బదిలీలపై సందిగ్థత వీడడం లేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని బదిలీలు చేయకపోవడంతో ఆ శాఖలో ఏం జరుగుతుంతో అర్ధం కావడం లేదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Tags

Next Story