రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు : హరీష్ రావు

రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు : హరీష్ రావు
X

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల తలరాత మార్చలేదు గానీ.. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి అస్తిత్వాన్ని దెబ్బతీశారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడని హైదరాబాద్ రోడ్డుకు ఆయన పేరు పెడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. అమెరికాలో మన పిల్లలకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి.. ప్రకటన వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. దీంతో ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 23ను విద్రోహి దినంగా జరపాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసేలా రేవంత్ వ్యవహారం ఉందని హరీష్ రావు ధ్వజమెత్తారు.

Tags

Next Story