తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది: రేవంత్

హైదరాబాద్: అన్ని జిల్లా కలెక్టరేటర్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని అన్నారు. రూ.5.8 కోట్లతో 33 కలెక్టరేటర్లలో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి వర్చువల్ గా రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రారంభించారు. మొత్తం 18 అడుగుల ఎత్తుతో తెలంగాణ తల్లి విగ్రహాల నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని తలచుకుని పనులు మొదలుపెట్టేందుకే విగ్రహాల ఆవిష్కరణ చేశామని, 2009 లో ఇదే రోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
-
Home
-
Menu
