డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ఈగల్ టీమ్ పనితీరు భేష్: కిషన్ రెడ్డి

మన తెలంగాణ – హైదరాబాద్: దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నషా ముక్త్ భారత్ నిర్మాణం కోసం పనిచేయాలని నిర్ణయించారని అన్నారు. పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ సమస్యతో తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడం కూడా యువత మత్తు పదార్థాల వినియోగం వైపు వెళ్లడానికి ఒక కారణమని, పట్టణ ప్రాంతాల్లో 25 శాతం మంది యువత డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు, కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించగలమన్నారు.
డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తూ, సరఫరా చేస్తున్న వారే తమ లక్ష్యమని, తల్లిదండ్రులు, యువత డ్రగ్స్ ఫ్రీ వారియర్స్‌గా మారాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సరిహద్దుల నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలను మరింత బలోపేతం చేస్తామని, అక్రమ రవాణాదారులను గుర్తించేందుకు సరిహద్దుల్లో జాగిలాల సంఖ్యను పెంచుతున్నామని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది యువతకు నషా ముక్త్ భారత్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ఈగల్ టీమ్ అద్భుతంగా పనిచేస్తోందని కిషన్ రెడ్డి ప్రశంసించారు.
Tags
-
Home
-
Menu
