శనివారం రాశి ఫలాలు

శనివారం రాశి ఫలాలు
X
క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. పనులలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం

మేషం - క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. పనులలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు.

వృషభం - పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

మిథునం - ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. విందు వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన వస్తు సేకరణ చేపడతారు.

కర్కాటకం - అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలుగును.

సింహం - పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు.

కన్య - వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

తుల - వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది.బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. చట్టపరమైన చిక్కులలో చిక్కుకున్న మీవారిని రక్షించవలసిన గురుతర బాధ్యత మీ పైన పడుతుంది.

వృశ్చికం - వృత్తి వ్యాపారాలలో అనుకూలం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.

ధనుస్సు - ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.

మకరం - అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

కుంభం - ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట లభిస్తుంది.

మీనం - వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల కొంత ఆనందం కలుగుతుంది. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

Tags

Next Story