జర్మనీలో జనగామ జిల్లా విద్యార్థి మృతి

జర్మనీలో జనగామ జిల్లా విద్యార్థి మృతి
X

ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లిన జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ప్రమాదవశాత్తు జర్మనీలో మృతి చెందాడు. తోకల సంపత్ రెడ్డి- కరుణలకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు తోకల హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్ళాడు. అక్కడ తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం సంభవించగా ప్రాణ రక్షణ కోసం తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ నాల్గవ అంతస్తు నుండి కిందకి దూకాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించినట్లు సమాచారం. హృతిక్ రెడ్డి మరణంతో ఆయన స్వగ్రామం మల్కాపూర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story