జూరాల ప్రాజెక్టు వద్ద హైటెన్షన్

జూరాల ప్రాజెక్టు వద్ద హైటెన్షన్
X

అడుగడుగునా పోలీస్ పహారా

24 గంటల గడువు ముగిసింది.

మా నీళ్లు మాకు కావాలి

మన తెలంగాణ ప్రతినిధి, గద్వాల: ధరూర్‌ మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఒకసారి వాతావరణం వేడెక్కింది. జూరాల ప్రాజెక్టు అధికారులు 24 గంటలలో కుడి కాలువకు సాగు నీటిని విడుదల చేస్తామన్నా గడువు ముగిసింది. ఇక చేయాల్సింది ఏమి లేదు.. మా నీళ్లు మాకు కావాలి.. సాగుకు నీరందిచకపోతే ఆత్మహత్యలే శరణ్య అంటూ రైతులు వాపోతున్నారు. అధికారులు విధించి‌‌న 24 గంటలు‌ గడువు ముగియడంతో జూరాల ప్రాజెక్టు వద్ద‌ ఏ క్షణం.. ఏమి జరుగుతుందో ఆందోళన నెలకొన్నది. దీంతో జూరాల‌ ప్రాజెక్టు మొత్తం భారీగా పోలీసు లు మొహరించారు. శనివారం ధరూర్ మండలం రేవులపల్లి భీంపురం గ్రామాలకు చెందిన రైతులు‌ జూరాల కుడికాలువకు సాగు నీటి విడుదల చేయాలని జూరాల ప్రాజెక్టు మీద ధర్నా చేపట్టారు. దీనికి తోడు‌ అమరచింత మండలం నందిమల్ల, మూలమల్ల, గ్రామాలకు చెందిన రైతులు జూరాల‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని‌ ధర్నా చేపట్టారు. కాగ జూరాల‌ నుంచి ఎడమ కాలువకు రైతులే స్వయంగా గేట్లు తెరిచి కాలువకు సాగు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసుకున్నారు. అయితే శనివారం రాత్రే జూరాల అధికారులు ఎడమ కాలువ గేట్లు మూసివేశారు. కాగ జూరాల ప్రాజెక్టు లో ఉన్న నీటి నిల్వలు దృష్టిలో పెట్టుకుని ‌కుడి, ఎడమ, సమాంతర కాలువలతో పాటు నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు సాగు నీటిని పూర్తి స్థాయిలో నిలిపివేశారు. జూరాల ప్రాజెక్టులో ఉన్న నీళ్లు త్రాగునీటి అవసరాలకే సరిపోతాయని, ఎల్ నినో ప్రభావంతో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.

కుడి కాలువ దగ్గర పోలీసుల మోహరింపు

జూరాల ప్రాజెక్టు‌ నుంచి కుడి కాలువకు‌ రైతులు గేట్లు ఓపెన్ చేసుకుంటారన్న సమాచారంతో ధరూర్ రెవెన్యూ, పోలీస్ అధికారులు గస్తీ చేపట్టారు. శనివారం అమరచింత మండలం నందిమల్ల, మూలమల్ల, గ్రామాలకు చెందిన రైతులు జూరాల‌ ఎడమ కాలువకు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసుకున్నారు. అవతలి ప్రాంత రైతులకు సాగు నీరు విడుదల చేసుకున్నారు కాని ఈ‌ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్న ఎందుకు అధికారులు సాగు నీరు విడుదల చేస్తలేరని రైతులు మండిపడుతున్నారు. వార బందీ ద్వార సాగుకు నీరుందించి రైతాంగాని ఆదుకోవలని డిమాండ్ చేశారు.

Tags

Next Story