సీతక్క పర్యటనలో ఉద్రిక్తత

సీతక్క పర్యటనలో ఉద్రిక్తత
X

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: జనగామ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ బైపాస్‌వద్ద సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ విగ్రహాల ఆవిష్కరణలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇదే సమయంలో అక్కడ రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ ప్రతినిధులను పిలిచి కొబ్బరి కాయలు కొట్టిస్తుండటాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్లతో ఎలా కొబ్బరి కాయలు కొట్టిస్తారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ డిసిసి అధ్యక్షుడు కొమ్మరి ప్రతాపరెడ్డి వర్గం ‘ఎమ్మెల్యే పల్లా గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయగా, దీనికి ప్రతిగా బీఆర్‌ఎస్ నాయకులు కూడా పోటాపోటి నినాదాలతో స్పందించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మంత్రి సీతక్క కార్యక్రమం మధ్యలోనే రాజకీయ ఘర్షణ తలెత్తడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.

Tags

Next Story