కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్... వీడియో వైరల్

హైదరాబాద్: కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతల వీరంగం సృష్టించారు. కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసకుంది. కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి, తన అనుచరులతో కలిసి క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకొని హంగామా సృష్టించాడు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గీరెడ్డి మహేందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నేతల కారు అద్ధాలను బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుపై దాడి చేయడంతో పాటు కారును బిజెపి కార్యకర్తలు బోల్తా పడేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, షబీర్ అలీ మధ్య భూ కబ్జాల ఆరోపణలు చేయడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. బిజెపి ఎమ్మెల్యే అరోరా భూములు కబ్జా చేశాడని కాంగ్రెస్ నేత షబీర్ అలీ ఆరోపణలు చేశారు. దీంతో దమ్ముంటే చర్చకు రావాలని బిజెపి ఎంఎల్ఎ వెంకటరమణ రెడ్డి సవాల్ విసిరారు. వెంకటరమణారెడ్డి సవాల్ ను కాంగ్రెస్ నాయకులు స్వీకరించి బిజెపి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో టెన్షన్ టెన్షన్ నెలకొంది.
-
Home
-
Menu
