మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత

మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత
X

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు అధికారులు ముగ్గు వేసేందుకు గ్రామానికి వచ్చారు. అయితే భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని , ఇండ్లకు ముగ్గు వేయవద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, గ్రామస్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్థులంతా ఏకమవ్వడంతో అటవీ అధికారులు వెనుదిరిగారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరకుండా గ్రామస్థులను చెదగొట్టారు. గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags

Next Story