వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
X

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో బుధవారం ఆర్టీసీ బస్సు వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. తృటిలో ప్రమాదం తప్పింది.హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దాదాపు 50 మంది ప్రయాణికులతో హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా సుందరగిరి శివారులో స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపు తప్పిరోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బావి పైభాగంలో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. తృటిలో ఘోర ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు చిగురుమామిడి ఎస్ఐ జగదీశ్వర్,ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Tags

Next Story