నవ్వులు పూయిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్

Tharun Bhascker
X

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ఆయన నటుడిగా మారిపోయారు. పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితమే ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారిపోయారు. ఆ హీరోగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళం వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘జయ జయ జయహే’ సినిమాకి ఇది రీమేక్.

తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. గోదావరి బ్యాక్‌డ్రాప్ ఈ సినిమా సాగుతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని అనుకొనే భర్తకి.. ఊహించని విధంగా భార్య అతడిపై తిరగబడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. మొత్తానికి టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. నేయిటివిటికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఈశా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎఆర్ సజీవ్ ఈ సినిమా దర్శకుడు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags

Next Story