ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?... సిలబస్ లో మార్పులు

ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?... సిలబస్ లో మార్పులు
X

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల తేదీలు ఖరారు చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్మీడియట్ సిలబస్ లోనూ మార్పులు చేశామన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్‌, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని తెలియజేశారు. ఇంటర్నల్స్ కు 20 మార్కులు, ఎక్సటర్నల్ పరీక్షలుకు 80 మార్కులు అని వివరించారు. 12 ఏళ్ల తర్వాత ఇంటర్ బోర్డులో సైన్స్ సిలబస్ లోమ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్ లో మార్పులు చేశామని ప్రకటించారు. హ్యూమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్, అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ లతో ఎసిఇ కోర్సు ఇంటర్ బోర్టు తీసుకొచ్చిందన్నారు.



Tags

Next Story