‘ది ప్యారడైజ్’ సినిమాకు మైనర్లు వచ్చారని.... గంటకు పైగా నిలిచిన ప్రదర్శన

The Paradise movie
మన తెలంగాణ / పేట్ బషీరాబాద్ : సుచిత్ర సర్కిల్ సమీపంలోని టీఎన్ఆర్ (సినీపోలిస్) మల్టీప్లెక్స్‌లో గురువారం రాత్రి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రదర్శన సందర్భంగా గందరగోళం నెలకొంది. ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రానికి 18 ఏళ్లలోపు వారికి ప్రవేశం లేకపోవడంతో పోలీసులు థియేటర్‌లో తనిఖీలు చేపట్టారు. స్క్రీన్-4లో ఉన్న మైనర్లను బయటకు పంపించే ప్రయత్నం చేయడంతో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టికెట్లు జారీ చేసే సమయంలోనే వయసు నిబంధనలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన షో పోలీసుల తనిఖీలు, వివాదంతో గంటకు పైగా ఆలస్యమై నిలిచిపోయింది. దీంతో థియేటర్ ఆవరణలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా, పోలీసులు, మల్టీప్లెక్స్ సిబ్బంది ప్రేక్షకులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
-
Home
-
Menu
