ఇక్కడ బంధుప్రీతి, స్నేహం ఏమీ ఉండవు

X
ధర్మ ప్రొడక్షన్స్‌లో ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. క్లాసిక్ సినిమాలను అంధించిన ధర్మ ప్రొడక్షన్ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ సినిమాలను అందించడంలో విఫలం అవుతూ వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ చాలా మంది యంగ్ హీరోలకు, హీరోయిన్స్‌కి ధర్మ ప్రొడక్షన్స్‌లో ఒక్క సినిమా అయినా చేయాలనే కోరిక ఉంటుంది. కరణ్ జోహార్ ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ చాలా మంది స్టార్స్ తన బ్యానర్‌లో నటించడానికి కారణం వారికి ఫేమ్ వస్తుందని, అలాగే మేము వారితో సినిమాను నిర్మించడానికి కారణం మాకు డబ్బు వస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంతే తప్ప ఇక్కడ బంధుప్రీతి గాని, స్నేహం గాని ఏమీ ఉండవు అన్నాడు. అంతే కాకుండా ఇండస్ట్రీలో స్నేహంను నమ్ముకుని ముందుకు పోతే చివరకు నిరాశ మిగులుతుందన్నాడు.
Next Story
-
Home
-
Menu
