వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురు మృతి

వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురు మృతి
X

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో శనివారం ఘోర విశాదం చోటుచేసుకుంది. కొరికిశాల గ్రా మంలో వ్యవసాయ బావిలో పూడికతీస్తుండగా క్రేన్ వైర్ తెగి క్రేన్ బావిలో పడగా క్రేనువద్ద ఉన్న ముగ్గురు మృతి చెందగా ఒక్కరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవా రావు(48) బండారి అభిలాష్(14) అదే మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన సరిగోమ్ముల పైడయ్య (53) ముగ్గురు మృతి చెందగా, సుకినే మోహన్‌రావుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఒకే ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మోహన్‌రావుకు తలకు వెనుక వైపు బలమైన గాయమైంది అలాగే పక్కటెముకలు కూడా విరిగగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి 108 అంబులెన్స్‌లో తరలించారు.

మృతి చెందిన దేవరావు, గాయపడిన మోహన్‌రావులకు చెందిన వ్యవసాయబావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవరావు, మోహన్‌రావు, పైడయ్యలు బావి పైనుండి క్రేన్ నడు పుతుండగా అభినాష్‌లనే పదో తరగతి విద్యార్థి అక్కడికి వెల్లగా బరువుకోసం క్రేన్ పై నిలబడగా ఒక్క సారిగా క్రేన్ వైరు తెగగా క్రేన్ బావిలో పడిన సందర్భంలో క్రేన్ తగలి ముగ్గురు మృతిచెందారు. బావిలో ఉన్న మరో ఇద్దరు క్రేన్ ఓనర్లు మహిళ, పురుషుడుకి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పదో తరగతి విద్యార్థి అభిలాష్ శనివారం జరిగిన పరీక్షకు హాజరై బావి దగ్గరు వచ్చి ప్రమాదంలో మరనించాడు. ఈ సపంఘటనతో మొగుళ్లపల్లిలో విశాదచాయలు చోటు చేసుకున్నాయి. ఈసంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.

Tags

Next Story