సముద్రంలో మునిగి ముగ్గురు హైదరాబాదీలు మృతి

సముద్రంలో మునిగి ముగ్గురు హైదరాబాదీలు మృతి
X

బాపట్ల: సరదా కోసం సముద్ర స్నానానికి వెళ్లిన యువకుల కథ విషాదాంతం అయింది. చీరాల బీచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు. చీరాల మండలం వాడరేవు తీరంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు నీట మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్, సాయి మణిదీప్, జీవన్ సాత్విక్‌లుగా గుర్తించారు. వీళ్లు అమరావతిలోని విట్‌లో చదువుకుంటున్నట్లుగా తెలిసింది. యువకుల మృతదేహాలను చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గల్లంతైన మరో ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story