పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి

పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి
X

హైదరాబాద్: హనుమకొండ భీమదేవరపల్లి మండలం గోపాల్ పూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొని డిసిఎం, ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి వేడుకలకు వస్తుండగా ఈ వాహనం ప్రమాదానికి గురైంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు మహబూబాబాద్ జిల్లా సుందనపల్లి వాసులుగా, మృతులు కమలమ్మ(60),త్రినాథ్ (5), స్వప్నగా పోలీసులు గుర్తించారు.

Tags

Next Story