సెప్టిక్ ట్యాంక్‌లో విషాదం.. ముగ్గురు కార్మికులు మృతి!

Three Workers  in Septic Tank
X

హైదరాబాద్‌: నగర శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాచుపల్లిలోని దినేష్ హౌసింగ్ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు దిగారు. విషవాయువుల కారణంగా ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సరైన భద్రతా చర్యలు లేకుండా కార్మికులను ట్యాంక్‌లోకి దింపారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతులను హెచ్ ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీకి చెందిన సుమన్ (24), సురేష్ (25), పవన్ (25)గా గుర్తించారు.

Tags

Next Story