చిన్నారిపై కోతి దాడి..

చిన్నారిపై కోతి దాడి..
X

ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి పై కోతులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మందలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఈ నెల 12న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే.. చిన్నారి తల్లిదండ్రులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఒక కోతి వచ్చి దాడి చేసింది. దాడి గమనించిన పక్కింటి మహిళ కోతిని కర్రతో కొట్టడంతో చిన్నారి వదిలి వెళ్లింది. ఆమె వెంటనే చిన్నారి దగ్గరికి తీసుకొని కోతులను దూరంగా తరిమింది. అనంతరం చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించింది. ఈ ఘటన అంతా స్థానికంగా ఉన్న సిసి కెమెరా లో రికార్డైంది. గాయలపాలైన చిన్నారి అన్వికను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.

Tags

Next Story